Leading News Portal in Telugu

Kishan Reddy: అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం.. గ్రూప్ -1 ఇష్యూ పై కిషన్‌ రెడ్డి సీరియస్‌


Kishan Reddy: అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, గ్రూప్ -1 ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కిషన్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు అగమయ్యారని మండిపడ్డారు. నిన్న హై కోర్టు మళ్ళీ పరీక్ష ను రద్దు చేసిందన్నారు. దీనికి సీఎం కేసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందన్నారు. కేసిఆర్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అభ్యర్థుల జీవితాలతో కేసిఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసిఆర్ ప్రభుత్వం ఉందన్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ లలో జరిగే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని తెలిపారు. హైదరబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభం చేస్తారని అన్నారు. సివిల్ ఏవియేషన్ రిసెర్చ్ సెంటర్ ను మోడీ ప్రారంభిస్తారని అన్నారు. Tspsc వైఫల్యానికి నైతిక బాధ్యత కేసీఆర్ వహించాలని డిమాండ్ చేశారు.

Read also: Black turmeric : నల్ల పసుపు .. దీని గురించి తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు

సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు వందే భారత్ ట్రైన్ లను ఇవ్వడం జరిగిందన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మూడోవ ట్రైన్ ను ప్రారంభిస్తున్ననoదుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల తరుపున ప్రధాని మోడీకి, రైల్ వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. 12 జిల్లాల మీదుగా, మూడు రాష్ట్రాలను టచ్ చేస్తూ ఎనిమిదిన్నర గంటల్లో బెంగళూర్ కు చేరుకుంటుందని తెలిపారు. రెండు ఐటీ రంగంలో వేగంగా దూసుకు పోతున్న రెండు నగరాల మధ్య ట్రైన్ ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అక్టోబర్ 1, 3వ తేదీల్లో మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు.. కీలక అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. రైల్వే అభివృద్ధికి 4418 కోట్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రైల్ వే స్టేషన్ ల అభివృద్ధికి 2500 కోట్లు మోడీ ప్రభుత్వం కర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లను ఆధునీకరించబోతున్నామని తెలిపారు.
Meditation: గర్భంతో ఉన్న వారు ధ్యానం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?