Rains Alert: రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వెల్లడించింది. హైదరాబాద్‌తో సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని, అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని చెప్పింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా పయనిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ భాగాలపై వ్యాపించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు, రేపు ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read also: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుని వద్దకు పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూలైన్లు
అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. అక్టోబర్ ప్రారంభంలో, వాతావరణం క్రమంగా మారుతుంది. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు వీస్తాయని చెబుతున్నారు.ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, తిరుపతి జిల్లాలు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని… పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వారు తెలిపారు. రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు.
Minister KTR: మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్