Bandi Sanjay: కేసీఆర్ పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. గణేష్ ఉత్సవాలను రాజకీయాల కోసం బీఆర్ఎస్ వాడుకుంటోందని అన్నారు. మండపాల ఏర్పాటుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని పలు కాలనీల్లోని పలు గణేష్ మండపాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు సీఎం కేసీఆర్ పంపిణీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గ్రూప్-1 పరీక్షల రద్దుపై ఆయన స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటమాడారని సంజయ్‌కుమార్ అన్నారు.
Read also: Bhatti Vikramarka: భట్టితో బీసీ నేతల భేటీ.. ఆ రెండు సీట్లు ఇవ్వాలని విజ్ఙప్తి
రాష్ట్రంలో పోటీ పరీక్షలే కాదు, టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా ఈ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతోందన్నారు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతుందని యువత తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం అతని తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి పరీక్షలకు హాజరు కావడానికి నిరుద్యోగ యువతకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,116 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ మద్యాన్ని ప్రోత్సహిస్తూ మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆరోపించారు.
Skanda :వైరల్ అవుతున్న స్కంద రిలీజ్ ట్రైలర్ ప్రోమో…