పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాదయాత్ర చేస్తున్నారు. ముత్తారం మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర 15 రోజుల్లో సుమారు 311 కిలో మీటర్లు మేర ఆయన నడవనున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. తనను మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసారని మానసిక ఆవేదనతో పాదయాత్రలో ఆయన కంటతడి పెట్టాడు. ఈ సందర్భంగా పుట్ట మధు మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ఒక్కటి కూడా బయటకు తీయలేదు.. ఏ ఒక్క మీడియా సంస్థ కూడా బయట పెట్టలేదు అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తనపై కుట్రలు, తనను అంత మొందించాలని పలు మీడియా సంస్థలు కుట్ర చేశాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అనేక ఆరోపణలు, తన తప్పులు ఏమైనా ఉంటే ఉరి వేసుకొని చస్తానంటూ ఆయన వ్యాఖ్యనించారు. సోషల్ మీడియా, పెద్ద పెద్ద మీడియాలను వాడుకొని నన్ను చంపే ప్రయత్నం జరుగుతుంది అని పుట్ట మధు అన్నారు.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తల పెట్టిన ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ.. పుట్ట మధును చంపడానికి కుట్ర జరుగుతుందని ఇంటలిజెన్స్ రిపోర్టర్ వచ్చినా పట్టించుకోకుండా ప్రజా ఆశీర్వాద పాదయాత్రతో ప్రజల్లోకి ఆయన వెళ్తున్నాడు అని తెలిపారు. పుట్ట మధుకు ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ కోరారు.