అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటిచింది. ఇక, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భారీగా వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తుంది. నగరంలోని ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుంది.
హైదరాబాద్ నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ నెల 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే.. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షం కురువగా.. సాయంత్రం మరోసారి వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఒకసారి వర్షం పడింది.. కాగా, ఆకాశం మేఘావృత అయింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Similar forecast today. Evening – night rains expected in various parts of Telangana https://t.co/CzhrsFEPuD
— Telangana Weatherman (@balaji25_t) September 25, 2023