కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక వ్యవస్థలు అన్ని ధ్వంసం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ చూసిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి.. అధికార పార్టీలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన చర్యలు ఉండవు.. మహిళ బిల్లు 2007లో రాజ్యసభలో అమోదించింది.. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ లోక్ సభలో ఆమోదం తెలిపింది అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి జనగణన లేకుండానే మహిళ బిల్లు అమోదం జరిగింది.. జనగణన న్యాయబద్దంగా ఉండాలి.. ఫెడరల్ వ్యవస్థకి భిన్నంగా మోడీ సర్కార్ వ్యవహారిస్తుంది అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగజారి ఛీ అనే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ కమిషన్ వల్ల కష్టపడి చదివిన లక్షలాది విద్యార్థులు రోడ్డున పడ్డారు.. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చలగాటం ఆడుతుంది అని ఆయన మండిపడ్డాడు. గ్రామ సభలు పెట్టి దళితబంధు అర్హులకి ఇవ్వాలి.. బీసీ బంధు ప్రచారం తప్ప అమలు ఏది?.. అని ప్రశ్నించాడు. పార్టీ కార్యకర్తలకి కాదు, పేదరికంలో అల్లాడుతున్నావారికి ఇవ్వండి.. రైతుబంధు తీసుకున్నా వారిలో వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు అని చాడా అడిగారు.
వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఎందుకు? అని చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు అవసరమా?.. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. ధరలకి రెక్కలు వచ్చినపుడు ఆ రేటుతో అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు ఎలా వంట చేస్తారు అని ఆయన అడిగారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో పొత్తులపై చర్చలు జరిగాయి.. రెండు మూడు రోజులలో పొత్తుల అంశం తెరపైకి వస్తది.. అసెంబ్లీలో ప్రజల గొంతుక లేదు.. చంద్రబాబు అరెస్టు కక్ష్యపూరితంగా ఉంది.. వాస్తవాలు బయటికి వస్తవి.. ధర్మం, న్యాయం గెలుస్తది.. ఈ సమస్యని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారు అని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.