Leading News Portal in Telugu

CM KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే సీఎం ఆరోగ్యం మెరుగయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. యశోద ఆసుపత్రికి చెందిన డాక్టర్లు సీఎం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ సూచించారు.

నేడు (మంగళవారం) రాత్రి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో కేసీఆర్ యశోద హస్పటల్ లో చికిత్స తీసుకున్నారు. అయితే ఈ సారి కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రగతి భవన్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక, గతంలో 2020 జనవరి 21న స్వల్ప అనారోగ్య సమస్యలతో సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. దగ్గు, జ్వరం కారణంగా ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ ఏడాది మార్చి 12న కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం ఏఐజీ హస్పటల్ కు వెళ్లారు. గంటన్నర పాటు కేసీఆర్ కు డాక్టర్లు టెస్ట్ లు చేసి.. పరీక్షల తర్వాత అవసరమైన మందులను కేసీఆర్ కు వైద్యులు ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతిభవన్ వెళ్లిపోయారు.