Leading News Portal in Telugu

Soyam Bapu Rao: కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవలేదు..


పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు. ఆదివాసీ ఎంపీని కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఆదివాసీలు నాతో మాట్లాడుతూనే ఉంటారు.. రేవంత్ రెడ్డి నాకు కుటుంబ సభ్యుడు.. ఆయన అంటే నాకు అభిమానం.. కొంత మంది బీజేపీ నాయకులకు అవగాహన లేదు.. బీజేపీ ఇక్కడ ఎంపీగా ఎప్పుడు గెల్వలేదు.. ఏమన్నా అంటే ఎంపీ ల్యాండ్స్ అంటున్నారు..అది ఒక్కరిద్దరి కుట్ర మాత్రమేనంటూ సోయం బాపురావు అన్నారు.

ప్రజల్లో బీజేపీకి ఆదరణ ఉంది అని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మొదటి నుంచి రమేష్ రాథోడ్ అంటే నాకు పడదు.. పార్టీ తీసుకున్నది కాబట్టి ధిక్కరించలేదు.. ఎంపీగా నేను ఉంటే వాళ్లకు టికెట్ రాదనే భయంతో కుట్రలు చేస్తున్నారు.. పార్టీ మారుతాడు అనే ప్రచారం చేస్తున్నారు.. సోయం బాపురావ్ లేకుంటే వాళ్లు గెల్వ లేరు అంటూ ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుంది.. కానీ, ఇలా సొంత పార్టీ నేతలపైనే తప్పుడు ప్రచారం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు.

ఆదిలాబాద్ లో ఆదివాసీ బిడ్డాగా నేను ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తునే ఉంటాను అని ఎంపీ సోయం బాపురావు అన్నారు. బీజేపీలోని కొందరు నేతలు నేను పార్టీ మారుతున్నాను అనే ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయించిన దానికి నేను కట్టుబడి ఉంటాను.. కానీ, ఇలా అసత్య ప్రచారం ఎంత వరకు మంచిది కాదని ఆయన చెప్పారు.