Minister KTR: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి.. ఇక, దీనికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ కూడా జరిగింది.. అయితే ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.. అది రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందన్న ఆయన.. ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు.. ఇక్కడ ర్యాలీలు ఎందుకు? ఏపీలో చేస్కోండి.. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.
అయితే, ఇక్కడ (హైదరాబాద్) ఎవరు చేసిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశం లా ఉందన్న ఆయన.. దీనిపై చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు.. ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలన్నారు. ఇక, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేష్ నాకు మిత్రులే.. ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.. చంద్రబాబు అంశం కోర్టులో ఉంది.. దీని గురించి మాకు అనవసరం అన్నారు. మరోవైపు.. లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. అందుకే ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పానని గుర్తుచేసుకున్నారు.. ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ.. ప్రశాతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దు అన్నారు కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ఎలాంటి ఆందోళనలు జరగలేదన్నారు మంత్రి కేటీఆర్.