Leading News Portal in Telugu

Singareni Elections: అక్టోబర్ లో కష్టం.. నేడు సింగరేణి ఎన్నికలపై వీడనున్న సస్పెన్స్..


Singareni Elections: సింగరేణి ఎన్నికలపై విడనున్న సస్పెన్స్ ఇవాల్టితో వీడనుంది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు జరుపాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే.. ఇవాళ ఆర్ఎల్సి అధ్యక్షతన అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. కాగా.. సింగరేణి యాజమాన్యం మాత్రం ఎన్నికల జరపాలా? వద్దా? అనేది ప్రభుత్వం ఇష్టం అంటున్నారు. అయితే అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తే ఎన్నికల నిర్వహణ కష్టంమని సింగరేణి కార్మిక సంఘాలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సింగరేణికి మరో ఏడాది ఎన్నికలు లేనట్టే అని భావిస్తున్నారు. అయితే ఇవాళ ఆర్ఎల్సి అధ్యక్షతన అన్ని కార్మిక సంఘాలతో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: TS TET Results: నేడే తెలంగాణ టెట్‌ ఫలితాలు.. చెక్‌ చేసుకోండి ఇలా..

సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కావాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సింగరేణి యూనియన్‌ ఎన్నికలను అక్టోబర్‌లోగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది. వాస్తవానికి సింగరేణి ఎన్నికలకు కేంద్ర కార్మిక సంఘం ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేసింది.అయితే అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండుగల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సింగరేణి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఎన్నికల ప్రక్రియను కొనసాగించి అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను గత వారం విచారించింది. ఈ క్రమంలో సింగరేణి తరపున ఏఏజీ జె.రామచంద్రరావు, స్టాండింగ్ కౌన్సిల్ శ్రీహర్ష రెడ్డి తమ వాదనలు వినిపించారు. సింగరేణి ఎన్నికల నిర్వహణకు అక్టోబర్‌లోగా హైకోర్టు గడువు విధించిన విషయాన్ని కార్మిక సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ ప్రస్తావించారు. ఈ రెండు వాదనలు విన్న ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది.
Hyderabad Metro: నగర ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు