Leading News Portal in Telugu

Bandi Sanjay: సీఎం కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి ?.. బండిసంజయ్‌ కీలక వ్యాఖ్యలు


Bandi Sanjay: సీఎం కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి? అని ప్రశ్నించారు. పాలమూరును ఎడారిగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. మోడీ ఎందుకు పాలమూరు రావద్దని చెప్పడానికి కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 575 టీఎంసీలు రావాల్సిన కృష్ణ జలాలను 299 టీఎంసీ లకు మార్చారన్నారు. ఎన్నికలు వస్తే తాయిలాలు ప్రకటన చేస్తారు ముఖ్యమంత్రి అని వ్యంగాస్త్రం వేశారు. పరీక్షలు నిర్వహించడం చేతగాని సర్కార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పిల్లల ఆత్మహత్యాలకు కారణం, ఆర్టీసీ కార్మికుల మరణాలకు కారణం ఎవరు…? నిరుద్యోగుల మరణాలకు కారణం ఎవరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేటీఆర్ భాషని అసహ్యించుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణకు ఎం చేసిందో చర్చకు సిద్ధమా? అన్నారు. కిషన్ రెడ్డి పట్ల కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మండిపడ్డారు. ఇస్తాంబుల్ లో నైజాం వారసుడు చస్తే అధికారిక అంత్యక్రియలు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకోసం జీవితాన్ని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే కనీసం నివాళి అర్పించని మూర్ఖుడు కేసీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మశాలీలను అడుగడుగునా అవమానిస్తున్నాడు సీఎం అన్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 15 నెంబర్ వరద గేటు కౌంటర్ వెయిట్ పడిపోయిన వాటిని పరిశీలించడానికి వచ్చిన హైదరాబాదు మెకానికల్ డి ఈ కరుణాకర్, జేఈ సంగీత్ లు ..పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై మాయమాటలు చెప్తున్నారని తెలిపారు. ఒక్క మోటార్ తో 10 లక్షల ఎకరాలకు నీరు ఇస్తారా? డ్యాం సిబ్బంది గేటు వద్ద ఉన్న చెత్త, కర్రలను తొలగిస్తున్నారని తెలిపారు.
Bhatti Vikramarka: కేటీఆర్‌, హరీష్‌ రండి కర్ణాటక వెళ్దాం.. ..ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేస్తా..