Leading News Portal in Telugu

TET: టెట్‌ ఫలితాలలో సత్తాచాటిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు


TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. జీహెచ్‌ఎంసీ హయత్ నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు. కష్టపడి చదవి టెట్‌ పరీక్షలో పాసయ్యాడు. బీఏ, బీఈడీ, ఎంఏ తెలుగు చదివిన నరేష్ ఉద్యోగం రాకపోవటంతో హయత్ నగర్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా టెట్‌కు ప్రిపేరై తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. టెట్‌లో ఫలితాల్లో ఉత్తీర్ణతను సాధించడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు తోటి కార్మికులు అతడిని అభినందిస్తున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా ఈ నెల 15న తెలంగాణవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు,84.12శాతం, పేపర్‌-2కు 1.90 (91.11 శాతం, లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది.