Leading News Portal in Telugu

Marri Shashidhar Reddy : తెలంగాణలో ఉన్న అక్రమ ఓటర్ జాబితా దేశంలో మరెక్కడా లేదు


తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ ఓటర్ జాబితా దేశంలో మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ నేత. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో సైతం 20లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అప్పటి సీఈఓ రజత్ కుమార్ సారీ చెప్పారని, ఈ సారి ఒకే కుటుంబం కు చెందిన ఒకే ఇంట్లో ఉండే వారిని వేర్వేరు బూత్ లలో ఓట్లు కేటాయించారన్నారు. ఇది ఎన్నికల నియమావళి కి పూర్తిగా విరుద్ధంగా ఉందని, రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు ప్రభుత్వం ఏది చెబితే అది చేసే వారే ఉన్నారని, ఓటు ఉన్నా వేసేందుకు అవకాశం లేకుండా దుర్మార్గపు ప్రక్రియ చేశారన్నారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ నిర్వాకం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలి అని ఆ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడని ఎన్నికల శాఖ అధికారులు చెప్పారన్నారు.

 

అంతేకాకుండా.. ‘ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ పార్లమెంటు లో ఒకే ఓటరు, ఒకే కమ్యూనిటీ వారికి రెండుమూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. అధికార పార్టీ కి ఓటు వేయని వారి ఓట్లు బలవంతంగా తీసివేయాలని ఒత్తిడి తెస్తోంది ప్రభుత్వం. ఫాం8 లక్షల లక్షల ధరకాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. క్లేమ్స్ అండ్ అబ్జెక్షన్ లకు రేపు చివరి తేదీ.. అక్టోబర్ 4న ఫైనల్ లిస్ట్ వస్తుంది. గడువు పొడిగించే అవకాశం ను పరిశీలించమని అడిగాం. 16జనవరి వరకు తెలంగాణ అసెంబ్లీ కి గడువు ఉంది. అందుకనుగుణంగా షెడ్యూల్ విడుదల చేయమని అడిగాం. లక్షల అప్లికేషన్ లు తక్కువ సమయంలో ఎలా ప్రాసెస్ చేస్తారు. బహదూర్ పురా లో 18 ఏళ్ల కొత్త ఓటర్లు 736. గతంలో 18 సంవత్సరాల వయసు వారు 4వేలు ఉన్నారు.

25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 13వేలకు పైగా కొత్త ఓటర్లు ఉన్నారు. ఇది అనుమొనాలకు తావిస్తోంది.. దీనిని వారిపై చేయమని కోరాం. ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల కు కనీసం 20రోజుల గడువు పొడగించాలి. అందుకనుగుణంగా చర్యలు చేపట్టండి. ఓటరు లిస్టు సరిగా లేకపోతే ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయి అని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. ఎన్నికల నిర్వహణ గడువు పెంచమని మేం అడగడం లేదు. తప్పుల తడక ఓటరు లిస్టు మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో జరిగింది. తప్పు చేసిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఓటరు లిస్టు లో తప్పుల తడక పై అవసరం అయితే న్యాయపోరాటం చేస్తాం. అధికారుల చర్యలు ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసేలా ఉన్నాయి.’ అని మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.