Khairatabad-Balapur Ganesh Live Updates: గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు గణనాయకుని ఊరేగింపు ప్రారంభమవుతుంది. 8 గంటల కల్లా టెలిఫోన్ భవన్, ఉదయం 9.30 – 10 వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, 12 కల్లా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉండేలా ప్లాన్ వేశారు అధికారు.
ఇక బాలాపూర్ లడ్డూ వేలంలో 36 మంది పాల్గొననున్నారు. 29 మంది పాతవాళ్ళు.. ఏడుగురు కొత్తవాళ్ళు వేలంలో పాట పాడనున్నారు. వేలంలో బాలాపూర్ గ్రామస్థులు ముగ్గురు పాల్గొననున్నారు. వేలంకు ముందే ఇతర ప్రాంతం వాళ్ళు 25 లక్షలు చెల్లించిన చెల్లించారు. ఒకవేళ ఇతర ప్రాంత వాసులు లడ్డూ దక్కించుకోక పోతే వేలం తర్వాత డబ్బు చెల్లించనున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ ధర 24 లక్షల 60 వేలు పలికింది. ఈసారి బాలాపూర్ లడ్డూ 25 లక్షలు దాటనున్నట్లు అధికారులు అంచనావేయనున్నారు. ఉదయం 8.30 తర్వాతే బాలాపూర్ లడ్డూ వేలం మొదలు కానుంది.