హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు.
ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతో పాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు.. గణపయ్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మిలాద్ ఉన్ నబీ, గణపతి నిమజ్జనం ఒకే రోజు రావడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే ముప్పును అంచనా వేశారు. హైదరాబాద్లో పాతబస్తీ సహా మిగిలిన ఏరియాల్లోనూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గణపతి నిమజ్జనం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలిసిందే. ఈ రెండు ఒకే రోజున వచ్చినప్పటికీ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోలేవు. అంతేకాదు, మతసామరస్యత వెల్లివిరిసింది. గణపతి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాలీని వచ్చే నెల 1కి వాయిదా వేశారు..
మరోసారి హైదరాబాద్లోని మతసారమస్యాన్ని వెల్లడించింది. ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించుకోవడం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సియాసత్ పత్రిక రిపోర్ట్ చేసింది. గణపతి నిమజ్జనం అదే రోజు రావడం వల్లే వాయిదా వేసినట్టు తెలిపింది. ప్రతి ఏడాది ఊరేగింపు సేమ్ డే నాడే నిర్వహిస్తారు..28 న వినాయకుడి నిమజ్జనం కావడం తో శాంతియుతంగా వాళ్ళు విరమించుకున్నారు.. ఇకపోతే కొన్ని ఏరియాల్లో వినాయకుడును 15 రోజులకు నిమజ్జనం చేస్తున్నారు..
“GANGA – JAMUNI Tehzeeb”: That’s what #Telangana is Proud of✊
Today happens to be the day when #GaneshNimarjan and #MiladUnNabi coincide
And here👇are the People and the Police👮♂️ celebrating the festivities with music and dance on the streets of #Hyderabad
When a Leader like… pic.twitter.com/H9PEZgbW78
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) September 28, 2023