Leading News Portal in Telugu

Telangana Cabinet: నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా.. ఎందుకంటే..


Telangana Cabinet: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అయితే మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, అక్టోబరు మొదటి వారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా యశోద వైద్యులు సీఎం కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్‌కు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఈసారి కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

కేబినెట్ సమావేశం జరిగిఉంటే..

అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, కొత్త పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వారు. అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై చర్చ జరిగింది. వాస్తవానికి గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గత సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో ఈ అంశంపై పెద్ద దుమారం చెలరేగింది. గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. తమిళిసైపై విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను గవర్నర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు?
Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..?