Leading News Portal in Telugu

Akbaruddin Owaisi: తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం చెప్పినట్లు వినాల్పిందే..?


చంద్రయాణాగుట్ట ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యనించారు. హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పై అక్బరుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు మేము బీజేపీ కీ” బి “టీం అంటున్నారు మరీ సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు.

అయితే, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త గా పని చేశారు.. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యాడు.. ఇపుడు కాంగ్రెస్ తో పని చేస్తున్నారు.. అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మేము లోకల్ మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు మాకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు.. మాపై ఎన్ని విమర్శలు చేసిన వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. మీరు ఎంతో చేస్తారో చేసుకోండి అంటూ ఓవైసీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్, అయినా కాంగ్రెస్ అయినా ఇంకా ఏ పార్టీ వచ్చిన మజ్లీస్ పార్టీ చెప్పినట్లే నడవాలి.. వినాలి అన్ని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.