Leading News Portal in Telugu

Dengue Fever: నిజమాబాద్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్.. నెలలో 192 కేసులు


Dengue Fever: వాతావరణంలో వస్తున్న మార్పులతో డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్ మోగుతున్నాయి. డెంగ్యూతో పాటు వైరల్‌ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఆసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్ల సంఖ్య పెరిగింది. మళ్లీ వర్షాలతో దోమలు పెరిగే అవకాశం ఉందని… ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాను డెంగ్యూ భయపెడుతోంది. ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, మళ్లీ కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు పెరిగిపోతున్నాయి. అదనంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండటం ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్యను పెంచుతుంది. అదే సమయంలో ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో ఉంటూనే డెంగ్యూతో కోలుకుంటున్నాడు. డెంగ్యూ ముఖ్యంగా చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది.

నిజమాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఒక్క సెప్టెంబర్‌ నెలలో 192 డెంగీ కేసుల నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కిసాన్ నగర్ లో 24 గంటల వ్యవధిలో డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మహిళల మృతి చెందారు. మృతులు మధుప్రియ, తుంగెల లక్ష్మీ గా గుర్తించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో డెంగ్యూతో ఆరుగురు మృతి చెందారు. దీంతో డెంగ్యూ మరణాలు ఆందోళన కలిగిస్తున్నారు.

మరోవైపు కరీంనగర్‌లోని చిన్నపిల్లల ఆసుపత్రిలో కూడా డెంగ్యూతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి సోకితే.. మరొకరికి సోకింది. జ్వరంతో పాటు దగ్గు, జలుబు సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. వృద్ధులకు జ్వరం తగ్గడం లేదు. ముఖ్యంగా దోమల వల్ల సీజనల్ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటే అందులో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. ట్యాంకులో నీరు నిలిచిపోవడంతో పాటు అపరిశుభ్రత కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో తాగునీరు కలుషితం కావడంతో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు.

క్లోరినేషన్ లేకుండా తాగునీరు సరఫరా చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో డ్రైనేజీ లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ, వైరల్ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరినట్లు రోగులు చెబుతున్నారు. ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని అంటున్నారు. డెంగ్యూతో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Astrology: సెప్టెంబర్‌ 30, శనివారం దినఫలాలు