Leading News Portal in Telugu

Minister KTR: ఖమ్మంలో కేటీఆర్ పర్యటన.. సత్తుపల్లిలో ప్రగతి నివేదన సభ


Minister KTR: ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి కేటీఆర్ తోపాటు పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్లు కొణిజర్ల మండలం అంజనపూరము గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయిల్ ఫామ్ కంపెనీ కి మంత్రి అజయ్ కుమార్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుని ఖమ్మంలో 1370 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన, అదేవిధంగా మున్నేరు వల్ల ముంపును అరికట్టేందుకోసం ఆర్ సిసి వాల్ నిర్మాణాలను శంకుస్థాపనలు చేస్తారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రగతి నివేదన సభ నిర్వహిస్తారు. ఖమ్మం నుంచి మళ్లీ భద్రాచలం బయలుదేరి వెళ్లి భద్రాచలంలో కరకట్ట నిర్మాణం తొలగింపు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సత్తుపల్లికి వెళ్లి సత్తుపల్లిలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకి మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత సత్తుపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటాం.

షెడ్యూల్‌ ఇలా..

* 10.45 గంటలకు కాల్వొడ్డుకు చేరుకొని మున్నేరు రివర్‌ ఫ్రంట్‌ తీగల వంతెనకు, ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
* 11.15 గంటలకు వీడీవోస్‌ కాలనీకి చేరుకొని సమీకృత వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.
* 11.30 గంటలకు కేఎంసీ కార్యాలయానికి చేరుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించనున్న రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు.
* 12 గంటలకు మమత ఆస్పత్రిలోని హెలిపాడ్‌ వద్దకు చేరుకొని హెలికాప్టర్‌లో భద్రాచలం వెళ్తారు.
భద్రాచలంలో..
* 12.30 గంటలకు భద్రాచలంలోని టొబాకో బోర్డులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
* 12.35 గంటలకు హెలిపాడ్‌ నుంచి బయలుదేరుతారు.
* 12.40 గంటలకు కూనవరం రోడ్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ దగ్గరకు చేరుకొని కరకట్ట నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తారు
* మధ్యాహ్నం ఒంటిగంటకు అంబేద్కర్‌ సెంటర్‌లో ఎస్‌డీఎఫ్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 1.15 గంటలకు కేకే ఫంక్షన్‌ హాల్‌లో ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 2 గంటలకు సత్తుపల్లికి బయలుదేరుతారు.

సత్తుపల్లిలో..

* మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లి చేరుకుంటారు.
* 2.35 గంటలకు జ్యోతి నిలయం స్కూల్‌ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 2.45 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబేద్కర్‌ ఆడిటోరియానికి శంకుస్థాపన చేస్తారు.
* 3 గంటలకు ఎన్టీఆర్‌ నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 3.15 గంటలకు షాదీఖానాకు, క్రిస్టియన్‌ భవనానికి, రింగ్‌ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
* 3.45 గంటలకు చంద్రా గార్డెన్స్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
* 4.50 గంటలకు సత్తుపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.
Room Rent: ఏంటి ఒక్క రాత్రికి రూ.14లక్షలా.. అంతలా ఏముందో..!