Leading News Portal in Telugu

MInister KTR : 6 గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు మాత్రమే


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ర్యాలీలో ఉత్సాహం చూస్తూంటే వెంకటవీరయ్య గెలుపు ఖరారు అయినట్లు కనిపిస్తుందన్నారు. కొన్ని కారణాల వల్ల వైరా ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ ను కాదని పార్టీ వేరొకరికి సీట్ కేటాయించిందని, ఎమ్మెల్యే పదవి ఎండు గడ్డితో సమానం,కేసీఆర్ తోనే నా ప్రయాణం అని ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్ అన్నారని ఆయన తెలిపారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఓ పెద్ద మనిషిని జిల్లా స్థాయిలో పెద్ద పదవిలో కుర్చోపెడితే కేసీఆర్ ను విమర్శించి వెళ్లిపోయారని, పదవి రాలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. దేవుడు అని పొగిడిన వారే నేడు కేసీఆర్ దుర్మార్గుడు అనటం ఎంత వరకు సమంజసమన్నారు.

అంతేకాకుండా.. ‘గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త డైలాగ్ లు వాడుతున్నారు. 150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్ పార్టీ వారెంటి అయిపోయింది.చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ. హైద్రాబాద్ లో లో కమెండ్,బెంగుళూరు లో న్యు కమెండ్, డిల్లో లో హై కమేండ్. దేశం లో ఎక్కడా 4 వేలు పించన్ ఇవ్వటం లేదు. 60 ఏళ్లు 200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నేడు 4 వేలు ఇస్తానంటే ఎలా నమ్మాలి. 150 సంవత్సరాల ముసలి నక్క కాంగ్రెస్..వాళ్ళను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఇదినట్టే. 6 దశాబ్దాలు మనల్ని సతాయించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి 6 గ్యారెంటీ లు అంటే నమ్ముధామ..ఆలోచన చేయాలి. 75 ఏళ్ల లో 11 అవకాశాలను ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రభుత్వం లో ఉన్నప్పుడు పనులు చేయటం చేతకాదు కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు కోరుతున్నారు. 73 వేల కోట్ల రూపాయలను రైతులకు రైతు బందు పేరుతో కేసీఆర్ అకౌంట్ లలో వేశారు. కేసీఆర్‌ వచ్చాక 43 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రం లో ఇంటింటికీ నల్లా నీళ్ళు ఇచ్చారు. 24 గంటలు కరెంట్ ఎక్కడ వస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ అడుగుతున్నాడు. ఖమ్మం జిల్లా కు వచ్చి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకుని తెలుసుకోవాలి..కరెంట్ వస్తుందో రాదో అని. రెండు టర్ముల్లో గతం లో ఎన్నడూ లేనంత అభివృద్ది తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ లా పెళ్లిళ్లు చేశారు. కాంగ్రెస్ హయం లో ప్రభుత్వ హాస్పటల్ దయనీయ పరిస్థితిపై సినిమాలో పాటలు వచ్చేవి..నేడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లో 26 లక్షల మంది కి 200 పెన్షన్ వచ్చేది. నేడు తెలంగాణ లో 46 లక్షల మందికి పెన్షన్ వస్తుంది. తండాలు కావాలన్న దశాబ్దాల డిమాండ్ ను నెరవేర్చింది కేసీఆర్. సత్తుపల్లి కి నర్సింగ్,పాల్ టెక్నిక్ కళాశాల లు కేసీఆర్ మంజూరు చేశారు.

890 కోట్లు సత్తుపల్లి నియోజకవర్గం లోని రైతులకు రుణమాఫీ కింద జమయాయ్యి. 90 శాతం సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి. గోదావరి జలాలు తెచ్చి ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు తాడుపుతాం. ఎవరు రైతు బందు ఎవరు రాబందు ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటల కరెంట్,ఏడాదికో ముఖ్య మంత్రి,అన్ని కుంభకోణాలు గ్యారెంటీ. దోచుకోవడం తప్ప ఇంకొకటి తెలియదు. టికెట్ ల కోసం కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు. 6 గ్యారెంటీ లు ఆరిపోయే దిపాలు మాత్రమే. తెలంగాణ ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసింది యన్టిఆర్ శిష్యుడు కేసీఆర్. సత్తుపల్లి నియోజక వర్గం లోని ప్రతి దళిత కుటుంభానికి దళిత బంద్ పథకం. హుజూరాబాద్ తరువాత సత్తుపల్లి లో దళిత బంద్ అమలు. ప్రత్యేక అధికారులను నియమించి దళిత బంద్ అమలు చేయాలి. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం.చివరి యాదవ సోదరుడి వరకు గొర్రెలు పంపిణీ చేస్తాం. వెయ్యి కోట్ల సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ది కి ఖర్చు పెట్టాం. స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ లా సండ్ర వెంకటవీరయ్య. భారత దేశం లో ఆశా వర్కర్లకు తెలంగాణ అత్యధిక వేతనాలు ఇస్తుంది. చెప్పుడు మాటలు విని ఆశా వర్కర్లు ఇబ్బంది పడొద్దు.ఆందోళనను విరమించాలి. కర్ణాటక నుండి వందల కోట్లు వస్తున్నాయి అంట. కాంగ్రెస్ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కార్ గుర్తు కే వేయాలి. పదవులు లేకపోతే,సీట్ లేకపోతే కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. సత్తుపల్లి జిల్లా కావాలంటే వెంకట వీరయ్య ను గెలిపించాలి.’ అని మంత్రి కేటాఆర్‌ అన్నారు.