Leading News Portal in Telugu

Harish Rao : కసిరెడ్డి నారాయణ రెడ్డి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు వివిధ అభివృద్ధి కార్యక్రమాలాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. 35 కోట్లతో కల్వకుర్తి, ఆమనగల్ ప్రాంతాల్లో ఆసుపత్రులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కసిరెడ్డిపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కల్వకుర్తి టిక్కెట్ ఇవ్వనందుకు పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకమని హరీష్‌ రావు ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు అండగా రైతు బంధు, రైతు బీమా పథకాలు ఉన్నాయన్నారు. బీజేపీ ఏం చేసిన తెలంగాణలో గెలవదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు కనీస వసతులు కూడా లేకపోతుండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా200 వందలు ఉన్న పెన్షన్ 2000 చేశారని ఆయన అన్నారు. త్వరలోనే తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేస్తామని హరీష్‌ రావు వెల్లడించారు. పక్క రాష్టాలు అన్ని తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు మంత్రి హరీష్‌ రావు.