మరోసారి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బచ్చన్నపేట కార్యకర్తల సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. వర్గాలుగా విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్ లు పెడుతున్నారని, పల్లా సమైఖ్యవాది, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని ఆయన ధ్వజమెత్తారు. నీపై ఎన్ని తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయని, నాపై తెలంగాణ ఉద్యమ రైల్వే కేసు లు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు. నగామలో వర్గాలు క్రియేట్ చేసిన ఘనులను ఖండిస్తున్నానని తెలిపారు. నేను ఓడిపోతానని ఏ సర్వే చెప్పలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందని ప్రశ్నించారు ముత్తిరెడ్డి. కాంగ్రెస్ పాగా జనగామలో బీఆర్ఎస్‌ను బలపరిచానన్న ముత్తిరెడ్డి.. సీఎం కేసీఆరే తన పనిని మెచ్చుకున్నారని తెలిపారు.
జనగామ ఎమ్మెల్యే లేకుండా జనగామ కార్యకర్తలతో పల్లా మీటింగ్పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానం గమనిస్తోందని, టికెట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ లీడర్లు తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు, లీడర్ల మనోభావాలను కేసీఆర్పరిగణనలోకి తీసుకొని తనకే టికెట్కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్అని, అప్పటిదాక పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేయొద్దన్నారు.