మీరూ భారత పార్లమెంటు సభ్యులు కావచ్చు.. పార్లమెంటులో మీ వాగ్ధాటితో దేశం మొత్తాన్ని ఆకర్షించవచ్చు.. అందుకు మొదటి అడుగు.. సిటిజన్ యూత్ పార్లమెంట్. 2023 అక్టోబర్ 8, 9, 10 ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలి వేదిక ఆగష్టులో కర్ణాటకలో జరిగింది. 280 మంది పాల్గొన్నారు. వాళ్లు పార్లమెంటేరియన్ కాగల మెలకువలు తెలుసుకున్నారు. కాకలు తీరిన నాయకుల సరసన నిలబడి పార్లమెంటులో ప్రజాగళాన్ని ప్రతిధ్వనింపజేయగలమన్న విశ్వాసాన్ని నింపుకున్నారు. ఇప్పుడు తెలంగాణ యువత కోసం హైదరాబాద్ వచ్చింది. మీ ప్రతి మాటా… ప్రతి చర్చలో మీ ఎత్తుగడ… ప్రతి అంశంపై ప్రజలను ఆకట్టుకునే మీ వాక్ప్రవాహం… వీటిని తీర్చిదిద్దే ఈ మూడురోజుల వేదిక మీలో దాగి ఉన్న పార్లమెంటరీ స్ఫూర్తిని, సృజనాత్మకతని, దేశభక్తిని జాగృతం చేస్తుంది. జ్వలింపచేస్తుంది.
ఎవరెవరిలో ఒక నెహ్రూ… ఒక సర్దార్ పటేల్… ఒక ఇందిరా గాంధీ…. ఒక వాజ్ పేయీ… ఒక పివి నరసింహారావు… ఒక సుందరయ్య… ఒక ఎన్టిఆర్… ఒక వైయస్ఆర్… ఇలా ఎవరెవరు దాగి ఉన్నారో ఎవరు చెప్పగలరు? 18-40 సం. మధ్య వయస్సు ఉంటే మీరూ అర్హులే. 3 అక్టోబర్ లోగా ‘Google Form’ నింపి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోడానికి సబ్మిట్ చేయండి. https://forms.gle/3rshpgfR5fe4ACUa9 మా నిపుణుల బృందం ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. న్యూఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంటులో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. Contact : +91 9319256888, +91 8951879312 citizenyouthparliament@gmail.com