Leading News Portal in Telugu

DK Aruna: బండారం బయటపెడితే కొడుకెందుకు ఉల్లిక్కి పడుతున్నాడు.. బీజేపీ కౌంటర్ ఎటాక్



Dk Aruna

నిజామాబాద్ లోని ఇందూరులో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలకు గాను మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు.

Read Also: Justin Trudeau: కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచుకోవాలని చూడటం లేదు..

ప్రధానిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ డీకే అరుణ పత్రిక ప్రకటన విడుదల చేసారు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఫైటర్ అని చెప్పడానికి సిగ్గులేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చీటర్ రావు అని విమర్శించారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలు దొంగనే దొంగ అనట్లుగా ఉందని డీకే అరుణ ఆరోపించారు. ప్రధానిపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, త్వరలో నీ పార్టీని తెలంగాణలో బొంద పెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎంతో మంది అమాయక యువతను దుబాయ్ పేరుతో దొంగ పాస్ పోర్టులు ఇచ్చి మోసం చేసిన ఘనుడు మీ తండ్రి అని ఆరోపించారు. అందుతే కాలు లేదంటే జుట్టు పట్టుకునే చరిత్ర మీదని డీకే అరుణ ధ్వజమెత్తారు.

Read Also: AP Police: కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా.. డీజీపీ ప్రకటన

మరోవైపు బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు. 2009లో కూడా తెలంగాణలో మహాకూటమి పేర కమ్యూనిష్టులుతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానా NDA ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకముందని తెలిపారు. కేటీఆర్ ఈ విషయంలో మోడీని తిట్టటం అవసరం కాదు.. అసమంజసం కూడా అని విజయశాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.