
Bandi Sanjay: పదిహేను రోజులయింది కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీపై కేసీఆర్ కుటుంబం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ పైన కేసీఆర్ కొడుకు అజయ్ రావు నిలువెల్లా విషం నింపుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల మందికోసం తెలంగాణ తెచ్చుకుంటే నలుగురి పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పర్యటన తర్వాత బీఆర్ఎస్ లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయని, కేసీఆర్ కుటుంబంలో లొల్లి స్టార్ట్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకు సీఎం అనగానే బీఆర్ఎస్ నిట్ట నిలువునా చీలిపోతుందన్నారు. కుటుంబం, పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదముందన్నారు. కేటీఆర్ సీఎం అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో భయం మొదలయింది… వాళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది కుటుంబం లో గొడవ స్టార్ట్ అయింది.. కేసీఆర్ వద్దకు ఎవర్నీ వెళ్ళనివ్వడం లేదు… ఆఖరికి సంతోష్ రావును కూడా దూరం పెట్టారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా? మీకు వ్యాపారాలు లేనప్పుడు ఆస్తులు ఎలా వచ్చాయి? ప్రశ్నించారు.
ప్రజలు బికారులు అవుతున్నారని, కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి దోచుకున్న సొమ్మును దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బతీసేందుకు వాడుతున్నారని తెలిపారు. బీసీ ప్రధాని అయితే ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. మీరు మీ భాషను చూసి తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని వ్యతిరేకించిన చీటర్ కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ మీద బురద చల్లినట్టేనా? అని ప్రశ్నించారు. రబ్బర్ చెప్పుల కేటీఆర్ కి వేల కోట్లు ఎలా వచ్చాయి పదిహేను రోజులయింది కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కేసీఆర్ తో ప్రెస్మీట్ పెట్టించండి… మాకు నమ్మకం కలుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలని కల్వకుంట్ల కుటుంబాన్ని కోరుతున్నామని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP-Janasena: జనసేన-టీడీపీ కలిసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చాయా..పవన్ బంధం తెగిపోయిందా..?