
పసుపు బోర్డ్ పై పింక్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారని, నేషనల్ టర్మరిక్ బోర్డ్ కేబినెట్ ఆమోదించిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పింకీలకు ఏం పిసుక్కోవాలో అర్థం కావడం లేదని, పసుపు రైతులు ఇప్పుడు బీజేపీ కి వేస్తారు.. వేయిస్తారన్నారు. పసుపు బోర్డ్ తో చాలా ఉపయోగాలున్నాయని, 16 వందల కోట్ల ఎక్స్ పోర్ట్స్ జరిగింది… వచ్చే ఏడాది 8 వేల కోట్ల ఎక్స్ పోర్ట్స్ ఉండాలని లక్ష్యం పెట్టారన్నారు ఎంపీ అరవింద్. – పసుపు ధర క్వింటాల్ కి ప్రస్తుతం 14 వేలు ఉంది.. బోర్డ్ ఏర్పాటుతో 25 వేలకు పెరుగుతుందని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు… ఏమయింది ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ బయట పెట్టాలని, 26వ తేదీన సీఎం అనారోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారన్నారు. పోటీలు పడి కేటీఆర్, హరీష్, కవిత మీటింగ్స్ పెడుతున్నారన్నారు.
Also Read : Cooperative Bank Scam: కేరళలో సహకార బ్యాంకు కుంభకోణాలపై అనిల్ ఆంటోనీ తీవ్ర ఆగ్రహం
నా తండ్రి మాజీ మంత్రి ఆయన ఆరోగ్యం వివరాలు ఎప్పటికపుడు తెలియజేశానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం వివరాలు బయటకు చెప్పాలన్నారు. కేసీఆర్, మోడీ మాట్లాడుకున్న విషయంపై కేటీఆర్ గుమ్మడికాయలా వ్యవహరిస్తున్నారని, రైల్వే స్టేషన్ లో హరీష్ రావు పిచ్చోడిలా ప్రవర్తించారన్నారు. ఏపీలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందని, తెలంగాణ సీఐడీ ఏం చేస్తుంది.. రేవంత్ రెడ్డి కనీసం మంత్రి కూడా కాదు.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. ఓటు కు నోటు కేసు ఎందుకు ముందుకు పోవడం లేదని, రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలే కాపాడుతున్నారన్నారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ కావాలని బీఆర్‌ఎస్ నేతలకు లేదు.. ప్రస్టేషన్ లో బీఆర్‌ఎస్ మునిగిపోతుంది. ఇందురు జిల్లాలో కాంగ్రెస్ కు దిక్కే లేదు. కేటీఆర్ ను కరిచిన రేవంత్ రెడ్డి ని కరిచినట్లు ఉంది. ఇప్పటికే సగం తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా పోయింది.. ఇప్పటికైనా ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు చొరవ తీసుకొని రేవంత్ ను మెంటల్ హాస్పిటల్ లో చూపించాలని సూచన. కేటీఆర్ ను కరిచిన కుక్కకి డోప్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలిందట.’ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.
Also Read : Somireddy Chandramohan Reddy: 9న లేదా 10న మా నేత బయటకు వస్తున్నాడు.. దమ్ముంటే టీడీపీ ప్రభంజనాన్ని అడ్డుకొండి..!