Leading News Portal in Telugu

TSLPRB : తెలంగాణలో కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల


తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గతేడాది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించిన పరీక్షలకు తుది ఫలితాలు విడుదల చేసింది టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ. ఇందులో.. 15,750పోస్టులకు అర్హులైన అభ్యర్థులను పోలీస్ నియామక మండలి ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు రేపు(గురువారం) ఉదయం నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది.

కాగా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో భర్తీ ప్రక్రయిను చేపట్టారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసి, శాంతి భద్రతలను కాపాడే దిశగా ఆలోచించిన ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5 ఉదయనికల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసు పెండింగ్ అంశాల నేపథ్యంలో పీటీవోలో 100 డ్రైవర్ పోస్టులు, డీఆర్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో నోటిఫై చేసిన 225 ఖాళీలకు సంబంధించి ఎంపికైన వారి వివరాలను విడదుల చేయనున్నట్లు తెలిపింది.