పదేళ్ళ తెలంగాణ వ్యవసాయ ప్రగతి నివేదికను మంత్రి నిరంజన్ రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆవిష్కరించారు. పంటల సాగు విస్తీర్ణం: 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా, 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది అని తెలిపారు. పెరిగిన సాగు విస్తీర్ణం కోటి 7 లక్షల ఎకరాలు (81.6 %) మేర ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ధాన్యం ఉత్పత్తి:
2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా.. 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నది అని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం సేకరణ:
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ.లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
ఇతర పంటల సేకరణ: అలాగే ధాన్యం కాకుండా రూ.11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరణ
సాగు నీరు:
పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి, నూతన ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన సాగునీటి ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం..
ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ లో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.
రూ.5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి, 8.93 టిఎంసి ల సామర్ధ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాగు నీటి శిస్తు రద్దు చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఉచిత విద్యుత్తు :
సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ, రాష్ట్రంలోని రైతులందరికి 24 గంటల ఉచిత విద్యుత్తు..
రైతు బంధు :
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 11 విడతలలో రూ.72 వేల 815 కోట్లు
రైతు భీమా :
రైతు భీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల భీమా పరిహారం చెల్లింపు.
రుణ మాఫీ:
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొదటి విడతలో 35.31 లక్షల రైతుల యొక్క రూ.16,144.10 కోట్లు రుణమాఫీ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రెండవ విడతలో ఇప్పటి వరకు 22 లక్షల 98 వేల 039 రైతుల యొక్క రూ. 13,000.51 కోట్లు రుణమాఫీ (రూ.1,40,000/- వరకు) కొనసాగుతున్న మిగిలిన రైతుల యొక్క రుణ మాఫీ ప్రక్రియ (మొత్త రుణ మాఫీ: రూ. 19,440 కోట్లు) కొనసాగుతుందన్నారు. 2014 నుండి రెండు విడతలలో కలిపి ఇప్పటివరకు 58.29 లక్షల రైతుల యొక్క రూ.29,144.61 కోట్లు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ విస్తరణ:
ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ.572 కోట్లతో 2601 రైతు వేది నిర్మాణ ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ.. క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
విత్తనాలు, ఎరువులు :
సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు.. విత్తనాలు నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు.. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50 శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి ఇప్పటి వరకు రూ.981.51 కోట్లతో 41.59 లక్షల క్వింటాళ్ల రాయితీపై వి రకాల పంటల విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ:
ఇప్పటి వరకు మొత్తం రూ.963.26 కోట్లతో, 6.66 లక్షల మంది రైతులకు సహాయం.
తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా ప- మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్ద
గోడౌన్ల సామర్థ్యం:
2014-15: 39.01 లక్షల మెట్రిక్ టన్నులు, ప్రస్తుతం 73.82 లక్షల మె టన్నులు
మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు:
196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా అందించాం..
సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మా రీసర్చ్ & అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు.
సూక్ష్మ సేద్యం:
రూ.1847.10 కోట్ల సబ్సిడీతో 7.79 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్య సాగు
పంట నష్ట పరిహారం:
పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1794.76 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
ఆయిల్ పామ్ సాగు:
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో 1,94,954 ఎకరాలకు చేరిన ఆయిల్ పామ్ సాగు.
వ్యవసాయ విద్యకు ప్రోత్సాహం:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతనంగా (11) వ్యవసాయ మరియు ఉద్యాన విద్య కళాశాలలు & పాలిటెక్నిక్ ల ఏర్పాటు
వ్యవసాయ కళాశాలలు : 5, ఉద్యాన కళాశాలలు : 1, వ్యవసాయ పాలిటెక్నిక్ లు: 4, ఉద్యాన పాలిటెక్నిక్ లు: 1 ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర తలసరి ఆదాయం:
2014-15: 1,12,162/-, 2022-23: .3,17,115/-
పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.