బీఆర్ఎస్ పార్టీకి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియా ముందుకు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ అని ఇక్కడ టికెట్ ఇచ్చారు.. నేనేమీ తప్పు చేశాను.. స్కాం చేశానా.. నియోజక వర్గం అభివృద్ధి నిధుల కోసం ఎంతో శ్రమించాను.. నా నియోజక వర్గంలో భూమి పూజ కోసం రాలేదు.. నేను ఎమ్మెల్యేగా ఉండగనే నా నిధులు ఆపారు.. కడెం డ్యాం తెగిపోతుంది అంటే అర్థరాత్రి డ్యాం వరకు వెళ్ళాను అని ఆమె పేర్కొన్నారు. మా సమస్య లను పరిష్కరించ లేదు.. ఖానాపూర్ నియోజకవర్గం వెనుక బడ్డది అని ఒప్పుకున్నారు.. నా నియోజక వర్గం 4 వందల ఇండ్లను నిర్మల్, ముదోల్ కి ఇచ్చారు అని రేఖానాయక్ తెలిపారు.
మీడియా ముందే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అభివృద్ధి చేసారు అని అక్కడక్కడ ఒక్కరిద్దారు ప్రశ్నించిన వారిపై దాడి చేసి కేసులు పెట్టారు అని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. జాన్సన్ నాయక్ ఎట్లా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. నా కుటుంబం గురించి మాట్లాడితే ఖబర్ధార్.. నేను పోటీలో ఉంటాను.. పార్టీ గురించి నిర్ణయం తీసుకుంటాను.. రెవెన్యూ డివిజన్ అడిగితే ఇవ్వలేదు.. కాళ్ళు మొక్కినా కనికరించ లేదు. రోడ్లు కాలే బ్రిడ్జిలు కాలేదు.. నన్నే కాదు ఖానాపూర్ ప్రజలను మోసం చేసారు అని రేఖానాయక్ వెల్లడించారు. జాన్సన్ నాయక్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు.. దమ్ముంటే మంత్రి పదవి తీసుకుని ఉండనుండే అని ఆమె అన్నారు.
మహిళను తొలగించి వస్తావా.. ఇన్ని రోజులు కేటీఆర్ తన దోస్తు కోసం అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించారు. నేను పార్టీలో ఉండను.. మహిళలకు బీఆర్ఎస్ లో చోటులేదు.. రాజీనామా చేస్తున్నాను అంటూ ఆమె వెల్లడించారు. ఏ పార్టీలో చేరేది తొందరలోనే చెప్పుతా.. బీఆర్ఎస్ కు వ్యతరేకంగా పాదయాత్ర ప్రారంభిస్తా.. బీఆర్ఎస్ పార్టీకి ఎస్టీ లంటే చిన్న చూపు.. బీఆర్ఎస్ లో ఎస్టీలను మార్చారు.. జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు అని ఆమె ఆరోపించారు. ఎస్టీ సర్టిఫికెట్ తీసుకున్నావ్.. వంద శాతం జాన్సన్ నాయక్ ఎస్టీ కాదు.. రేఖా నాయక్ ఎంటో తెలుసా. అని ఆమె పేర్కొన్నారు.