తెలంగాణలో ఆడపడుచులా అతి పెద్ద పండగ బతుకమ్మా.. ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బతుకమ్మలు రంగు రంగు పూలతో గుభాళిస్తాయి. ఆటపాటలతో బతుకమ్మను ఆడబిడ్డాలు కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునేదే ఈ బతుకమమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు.. తెలంగాణ ఆడబిడ్డలు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. ఈ బతుకమ్మను పేర్చటంలో తంగేడు పూలు వెరీ వెరీ స్పెషల్.. పసుపు రంగులో చూడగానే ఆకర్షణగా కనిపిస్తుంది. అయితే, కేసీఆర్ సర్కార్ ఈ తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తించింది.
అయితే, బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు వెలుగులో ఉన్నాయి. వాటిలో ఓ కథ తంగేడు పూలతో బతుకమ్మకు ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. అయితే, పూర్వకాలంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలంటే ఏడుగురికి చాలా ఇష్టం.. తమ ముద్దుల చెల్లికి చిన్న దెబ్బ తగిలినా వాళ్లు విలవిల్లాడిపోయేవారు. చెల్లిని అంత ప్రాణంగా చూసుకోవటం అన్నల భార్యలకు ఇష్టముండేది కాదు.. దీంతో ఆడబిడ్డ అంటే ఆ ఏడుగురు అన్నదమ్ముల్ల భార్యలు అసూయపడేవారు. అన్నలు ఎక్కడికెళ్లినా చెల్లెలి కోసం స్పెషల్ గా గిఫ్ట్ లు తీసుకొచ్చేవారు.. దాంతో వదినలకు ఆడబిడ్డ అంటేనే గిట్టేది కాదు.. కానీ భర్తలకు భయపడి వాళ్లు సైలెంట్ గా ఉండేవారు.
ఇలా అన్నల ప్రేమాభిమానాలతో చెల్లెలు సంతోషంగా జీవిస్తుంటే ఆడబిడ్డను చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వదినల మనస్సు మండిపోయేది. ఆమెను ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశ్శాంతి లభిస్తుంది అనుకున్నారు. అందుకు తగిన సమయం కోసం వేచి చూసేవారు. ఈక్రమంలో ఓ రోజు అన్నలు వేటకెళ్లారు. తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారికి ఓ చెడు ఆలోచన వచ్చింది. ఇదే సమయం తమ ఆడబిడ్డను వదిలించుకోవటానికి అనువైన సమయం అనుకున్నారు. తోటి కోడళ్లంతా కలిసి సదరు ఆడబిడ్డను ప్రతీ చిన్న విషయానికి తిట్టేవారు.. అలా ఆమెను చంపేసి ఊరి బయట పాతి పెట్టారు. దీంతో ఆ ఆడబిడ్డా అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది.
ఇక, ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు తమ చెల్లెలుకు ఎప్పటిలాగే గిఫ్ట్ లు తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భార్యాల్ని అడిగారు.. దీంతో వారంతా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇల్లు వదిలి అన్నదమ్ములందరికి డౌట్ వచ్చింది. చెల్లెల్ని వెతుక్కుంటు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. అలా తిరిగి తిరిగి ఓ చోట కూర్చొని చెల్లెలి గురించి మాట్లాడుకుంటూ.. బాధపడుతున్నారు. అన్నదమ్ములు తన కోసం పడుతున్న బాధల్ని చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి వారికి చెప్పింది.. అప్పుడు ఆ అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయమని చెప్పిందట.. అలా ఈ బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అనే నానుడి ఉంది.