అమిత్ షా అబద్దాల కోరు.. అమిత్ షా సభలో అన్ని అబద్ధాలు చెప్పారన్నారు ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న. ఇవాళ జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయన కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. సీసీఐని స్క్రాప్ కింద అమ్మేస్తామన్నారని, సీమెంట్ పరిశ్రమను ఎందుకు పునరుద్దరించలేదన్నారు. సీసీఐ రీఓపెన్ కోసం బీజేపీ రాష్ట్రానికి ఏ లేఖరాయలేదని, లేఖపేరుతో ఆదిలాబాద్ ప్రజలను మోసం చేయోద్దన్నారు జోగురామన్న. బీజేపీ ప్రభుత్వం హాయంలో నే సీసీఐ మూతపడ్డదని, ఆదివాసీల జిల్లాకు గిరిజన యూనివర్శిటి ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఆదిలాబాద్ ఏయిర్ పోర్టు విషయంలో పట్టించుకోవడం లేదని, ఆదివాసీలకు లక్ష 24 వేల కోట్లు ఇచ్చామన్న అమిత్ షా ఆదివాసీల అభివృద్ది ఎక్కడ జరిగిందన్నారు జోగు రామన్న. కేంద్రం నుంచి నయా పైసా ఇవ్వలేదని, ఆదివాసీ ఎంపిని గెలిపిస్తే ఆదివాసీలకు ఏ అభివృద్ది జరగలేదన్నారు. కేసీఆర్ కొడుకు,బిడ్డ తెలంగాణ ఉద్యమం చేశారన్నారు. అమిత్ షా నీకొడుకును ఎలా బీసీసీఐ ని సెక్రెటరీ చేశారన్నారు. సోయం బాపురావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని జోగు రామన్న తెలిపారు. ఫ్యాక్టరీని ప్రారంభించకపోగా.. పరిశ్రమలోని స్క్రాప్‌ను అమ్మకానికి పెట్టిందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.