Leading News Portal in Telugu

Etela Rajender : సీఎం కేసీఆర్‌ మీద, హుజూరాబాద్‌లో రెండు చోట్లా పోటీ చేస్తా


Etela Rajender : సీఎం కేసీఆర్‌ మీద, హుజూరాబాద్‌లో రెండు చోట్లా పోటీ చేస్తా

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఢీకొనేందుకు ఉవ్విళ్లూరుతున్న ఈటల రాజేందర్ తన వైఖరిని ప్రకటించారు. హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఈటల రాజేందర్‌. గజ్వేల్‌, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేయాలా లేదా కామారెడ్డి నుంచి పోటీ చేయాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కేసీఆర్ కు తలనొప్పి తెచ్చిపెట్టాలని ఈటల కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ఓటు ద్వారా కేసీఆర్ పై తన ఆధిపత్యాన్ని చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సాహసోపేతమైన చర్య… ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇదిలా ఉంటే.. ఈటల సతీమణి జమున.. కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అదంతా వాస్తవం కాదని తర్వాత పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇప్పుడు ఈటల కేసీఆర్‌పై పోటీ ప్రకటన చేసినప్పటికీ.. అందుకు పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.