
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. కాంగ్రెస్‌లో టికెట్ కోసం బీసీలకు ఆశావహులకు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లోని బీసీలంతా కలిసి నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓబీసీ కాంగ్రెస్ నేత కత్తి వెంకట్ స్వామి మాట్లాడుతూ.. బీసీల ఆందోళనని అధిష్టానాన్ని తెలవడం కోసం రేపు ఉదయం 11 గంటలకు బీసీ ఆశావహులంత గాంధీ భవన్ లో ఆందోళన చేస్తామన్నారు. టికెట్ల విషయంలో ఎవరి ఎన్ని డిమాండ్స్ ఉన్నా మా అందరి లక్ష్యం కాంగ్రెస్ గెలుపే అని ఆయన వెల్లడించారు. అమరుల ఆకాంక్షని నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమని, ఓబీసీలు కాంగ్రెస్ అండగా ఉంటున్నారన్నారు.
బీఆర్ఎస్ దోపిడీ లో ఎక్కువ నష్టపోయింది ఓబీసీలేనని, ఓబీసీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నప్పుడే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు సులువు అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. జనాభా ప్రకారం సీట్లు ఇవ్వాలని ఒత్తిడి పెరిగిందని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ చొప్పున పీఏసీ లో తీర్మానం చేశారన్నారు. 34 స్థానాలు ఇస్తారని ఆశ కలిగిందని, మొదటి విడతలో 72 స్థానాలు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అందులో కనీసం 10 మంది బీసీలకు కూడా స్థానంల లేవని సమాచారమని, బయట పార్టీ నుండి చేరే వ్యక్తుల వల్ల అభద్రతా భావం ఏర్పడిందన్నారు. బీసీలకు సమూచిత స్థానం ఇవ్వకపోతే పార్టీ ఓడిపోతుందని బెంగ పట్టుకుందని, ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటివి ఇస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. బయటి ప్రజలను ఒప్పించాలంటే 34 స్థానాలు ఇవ్వాలని, బీసీల వాటా వారికి ఇవ్వాలన్న నినాదం రాహుల్ గాంధీ దే అని ఆయన గుర్తు చేశారు.