Leading News Portal in Telugu

Muralidhar Rao: హమాస్ ఇజ్రాయెల్ పై దాడి క్రూరమైనది, హింసాత్మకమైనది


Muralidhar Rao: హమాస్ ఇజ్రాయెల్ పై దాడి క్రూరమైనది, హింసాత్మకమైనది

హమాస్ ఇజ్రాయెల్ పై దాడి క్రూరమైనది, హింసాత్మకమైనదని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ మానవాళి దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. కేవలం ఇజ్రాయెల్ Jews అనే కారణంగా మత పరమైన దాడికి పాల్పడ్డాయన్నారు. ఈ దాడికి సంబంధించి భారత దేశ దృక్పథాన్ని ట్వీట్ ద్వారా మోడీ స్పష్టం చేశారని ఆయన చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకం అని.. ఇండియా ఇజ్రాయెల్ కు సపోర్ట్ అని చెప్పారు. చాలా దేశాలకన్నా ముందుగా ప్రధాని ఖండించారని.. మద్దతు తెలిపారన్నారు.

తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉగ్రవాదం పై దృక్పథం లేకపోవడం దానికి మద్దతు ఇస్తునట్టేనని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుందని అర్థం అవుతుందని పేర్కొన్నారు.

మరోవైపు తీవ్రవాద సంస్థ హమాస్ కి మద్దతు ఇస్తున్నట్లు గా కాంగ్రెస్ మాట్లాడుతుందని మురళీధర్ రావు తెలిపారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు ఒక ముసుగు అని విమర్శించారు. తీవ్రవాద సంస్థలకు ఆ పార్టీ మద్దతు పలికిందని.. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రకటనలకు తేడా లేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల వ్యవహారం దేశానికి ప్రమాదమని మురళీధర్ రావు అన్నారు.