
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను తెలుసుకుందామని వెళ్తే.. వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారన్నారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకున్న ముఖ్యమంత్రి స్పందించడని బండి సంజయ్ అన్నారు.
Chandrababu Health: జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక
ఇంకా మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడని బండి సంజయ్ అన్నారు. కుటుంబంలో మనోధైర్యం నింపకుండా లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నాడని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం కుమిలిపోతోందని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ఆమె మరణం లవ్ ఫెయిల్ వల్ల చనిపోయిందని అబద్ధపు లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరని పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగా తాముంటామని బండి సంజయ్ అన్నారు. కోచింగ్ సెంటర్లు మొత్తం బంద్ చేసి మీ గ్రామాలకు వెళ్ళండని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండని.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి బీజేపీకి ఓటు వేసేలా చూడండని అన్నారు. నిరుద్యోగులకు తాను నియామక పత్రాలు అందజేస్తానని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వం కూల్చడం పెద్ద మ్యాటర్ కాదని తెలిపారు. 50 రోజులు కొట్లాడండి.. బీజేపీకి అండగా నిలవండని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bihar: యూట్యూబ్ లో ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!
నవంబర్ 30 కేసీఆర్ కు డెడ్ లైన్ కావాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా అని అన్నారు. కాంగ్రెస్, బీఆరెస్ ఒక్కటేనని విమర్శించారు. 3+3=6.. బీఆరెస్ ఇంటికి పోవడం ఫిక్స్ అని కామెంట్ చేశారు. కారు షెడ్డుకు పోయింది.. సారు ఫామ్ హౌజ్ కు.. 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలని బండి సంజయ్ అన్నారు.