Leading News Portal in Telugu

T.Congress: రేపు 58 పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా.. మరో రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు


T.Congress: రేపు 58 పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా.. మరో రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు

T.Congress: ఈ ఎన్నికల్లోనైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల పేర్లను కొలిక్కి తెచ్చారు. అయితే దీనికి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక ప్రకటన చేశారు.

రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఉంటుందన్నారు. మిగతా అభ్యర్థులను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గెలుపు, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి.. అధిష్టానం ఎవరికి హ్యాండ్ ఇవ్వనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.