
తెలంగాణలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితో పాటు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతేకాకుండా.. 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేశారు. అయితే.. రేపు సీఎం కేసీఆర్ జనగాంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశాయి. జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభ టెంట్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో జనగామ పట్టణం గులాబీ మయంగా మారింది.
Also Read : Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందా? షాక్ లో ఆడియన్స్..
డెబ్బై వేల మందితో సభకు జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. వికాస్ నగర్ లో సభ ప్రాంగనానికి దగ్గరలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అలాగే.. సభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ కటౌంట్లు వెలిశాయి. అయితే.. ఇవాళ జనగాం నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఇదిలా ఉంటే.. రేపు నిర్వహించనున్న జనగాం సభలో మాజీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసమే నేడు ప్రగత్ భవన్‌లో పొన్నాల లక్ష్మయ్య దంపుతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. అయితే.. వారికి సీఎం కేసీఆర్ స్వాగతం పలికి భేటీ అయ్యారు.
Also Read : Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పరిశీలన.. ఈవోపై మంత్రి ఆగ్రహం