Leading News Portal in Telugu

Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌.. కీలక నేత రాజీనామా


Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌.. కీలక నేత రాజీనామా

Telangana: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆకుల లలిత.. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది.

2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల లలిత.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరరు. ఆకుల లలిత 17 డిసెంబర్ 2021న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలై, 24 డిసెంబర్ 2021న ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది.