
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందే ఉంది, బీ ఫామ్ ఇవ్వడంలో ముందే ఉంది, ప్రచారంలో ముందే ఉంది.. రేపు గెలిచే సీట్లోలోనూ బీఆర్‌ఎస్ పార్టీ ముందే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి, మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో BRS కాపీ కొట్టిందని రేవంత్ రెడ్డి మాట్లాడారని, కాపీ కొట్టింది మీరు..మేము కాదన్నారు మంత్రి హరీష్ రావు. రైతు బంధు పెట్టింది ఎవరు..సీఎం కేసీఆర్ కాదా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్.. నయవంచన కి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని,
ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ వాళ్లు టికెట్లు అమ్ముకున్నారని రోజు గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నోట్లకి సీటు అమ్ముకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులే అంటున్నారు. ప్రధాని మోడీ కూడా సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్ల గురించి మాట్లాడుతారని స్వయంగా ప్రధాని చెప్పారు. ఓట్లు వచ్చాయని తిడితే మీ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి సీట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి. చివరికి మీకు ఓట్లు కావాలన్న ఢిల్లీ నుంచి నేతలు రావాలి. రాజ్ నాథ్ సింగ్ కి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి నవ్వుల పాలయ్యారు. స్కీములతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంటే కర్ణాటక లో రోజుకో స్కాములో కాంగ్రెస్ పార్టీ లీలలు బయటికి వస్తున్నాయి. 11సార్లు గెలిచిన కాంగ్రెస్ చేయని అభివృద్దిని పదేళ్ళలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.