Leading News Portal in Telugu

Kishan Reddy : ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్‌


Kishan Reddy : ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్‌

తెలంగాణ రావడంలో కీలకంగా రాజ్ నాథ్ సింగ్ వ్యవహరించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీ మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం చేశారని అన్నారు. తెలంగాణను పాలించింది కేసీఆర్‌ కుటుంబం అని, తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేసీఆర్‌ డైనింగ్ టేబుల్ మీద రాస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్‌ అని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.

అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ల పై ప్రైవేట్ వ్యక్తుల చేత కేసులు వేయించింది ఈ ప్రభుత్వమే. నిరుద్యోగుల పాలిట కెసిఆర్ కుటుంబము యమదూతలు గా మారారు. ప్రవళిక ఆత్మహత్య బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్య. బీఆర్‌ఎస్‌ మాఫియా కు డబ్బులు ఇవ్వక పోతే పేద రైతుల భూములు ధరణి లో ఉండవు. దళితులకు వెన్ను పోటు పొడిచిన మహా ఘనుడు కేసీఆర్‌. అన్ని పార్టీ లు మజ్లీస్ కు మద్దతు ఇస్తున్నాయి. మజ్లీస్ పార్టీ చెప్పిన వాళ్ళకే డబల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారు. మజ్లీస్ కోరలు పీకాలి… గతం లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి వంగి వంగి సలాం లు కొడితే… ఇప్పుడు బీఆర్‌ఎస్‌ సలాం కొడుతుంది. మహేశ్వరం ను మజ్లీస్ కు అడ్డాగా మారనియోద్దు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవాలి కానీ కాంగ్రెస్ రావొద్దు. బీజేపీకి ఒక్క సారి అవకాశం ఇస్తే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల సంగతి ఏంటో చూస్తాం’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.