Leading News Portal in Telugu

MLA Raja Singh: నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!


MLA Raja Singh: నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!

MLA Raja Singh: ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నేతలకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోనే దారుసలెం, ఎంఐఎం ఆఫీస్ లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టరు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడని తెలిపారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు పెట్టిండ్రని అన్నారు. ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని అన్నారు.

గోషామహల్ లో ఓవైసీ అభ్యర్థులతో బిజినెస్ చేస్తాడని అన్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలో ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచే డిసైడ్ అవుతదని తెలిపారు. 2014 ఎన్నికల్లో ముకేష్ గౌడ్ కు మద్దతు ఇచ్చేందుకు ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని అన్నారు. 2018 ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థిని దారుసలేం నుంచే డిసైడ్ చేసిండని అన్నారు. 2023 ఈ ఎన్నికల్లో కూడా దారుసలెం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. దారుసలేం కు ఇంకా డబ్బుల సంచులు వెళ్తే అభ్యర్థి ఎంపిక అయిపోతోందన్నారు. ఒక పెద్ద బిజినెస్ మాన్ అసదుద్దీన్ ఓవైసీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత డబ్బు సంపాదించుకుంటావ్ ఓవైసీ…? నా నియోజకవర్గంలో మీ అభ్యర్థిని పెట్టడానికి నీకు దమ్ము లేదా…? అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ నా మీద ? అంటూ సవాల్ విసిరారు.
Minister KTR: గంగుల మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే..