Leading News Portal in Telugu

TS High Court: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలని TSLPRBకి హైకోర్టు ఆదేశాలు


TS High Court: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలని TSLPRBకి హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది. పలు ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని రోజుల క్రితం ఆదేశించినా.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీంతో మెడికల్ టెస్టులు వెంటనే నిలిపివేయాలని కోర్టు నేడు (గురువారం) ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు తెలిపింది.