Leading News Portal in Telugu

MLA Shankar Naik: 35 రోజులు కష్టపడండి.. ఆ తరువాత ఐదేళ్లు ఏసీలో పడుకోబెడతా!


MLA Shankar Naik: 35 రోజులు కష్టపడండి.. ఆ తరువాత ఐదేళ్లు ఏసీలో పడుకోబెడతా!

MLA Shankar Naik:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత అన్నిపార్టీలు, అభ్యర్థులు ప్రజల్లోకి వుంటున్నారు. ఇలా ఇప్పటికయితే మాటలు, హామీలతోనే ఓటర్లకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు అన్నిపార్టీల అభ్యర్థులు. ఓటింగ్ సమయానికి ఈ ప్రచారం మరింతగా చేస్తూ వాడవాడలా తిరుగుతూ ప్రజలకు పార్టీ గురించి ప్రచారం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ప్రచారానికి వెళ్లిన కొందరు పార్టీ నేతలను గ్రామస్తులు అడ్డుకుంటున్న అయినా పార్టీలు గెలిపించాలనే ధీమాతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈనేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్ చేశారు.

మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్స్ లర్లు, సర్పంచులు ఎంపిటిసీలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 35 రోజులు కష్టపడండి…ఆ తరువాత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఏసీలో పడుకోబెట్టి చూసుకునే బాధ్యత నాది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బయట ఉళ్లో ఉన్న వారికి నేను అన్ని చూసుకుంటా అని చెప్పి ఊళ్లోకి తీసుకొచ్చి ఓటు వేయించండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టు ప్రతి ఒక్కరికి జేబులో పెట్టుకొని ఇంటి ఇంటికి తిరగాలని సూచించారు. మనం తిరిగే తిరుగుడుకు విసుగొచ్చి బిఆర్ఎస్ కే ఓటు వేస్తా అనాలి జనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తిరిగి, తిరిగి వచ్చి మన క్యాంప్ ఆఫీస్ లో భోజనం చేసి వెళ్ళాలని అన్నారు.
First Liplock Movie: స్వాతంత్ర్యం రాకముందే 4నిమిషాల పాటు లిప్ లాక్ సీన్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?