Leading News Portal in Telugu

Pocharam Srinivas Reddy: బాన్సువాడ నా అడ్డ.. మళ్ళీ ఏడో సారి ఎమ్మెల్యే మనమే..


Pocharam Srinivas Reddy: బాన్సువాడ నా అడ్డ.. మళ్ళీ ఏడో సారి ఎమ్మెల్యే మనమే..

Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎన్నికల సన్నాహాక సమావేశంలో బిఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 258 పోలింగ్ బూత్లో బూత్ స్థాయిలో 100 ఓటర్లకు ఒక్క నాయకుడుని నియమిస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల సర్వేలో 75 శాతం గ్రాఫ్ వచ్చినట్లు కాంగ్రెస్ కు 22 శాతం, బీజేపీకీ 4 శాతం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడో సారి మనమే ఎమ్మెల్యే మళ్ళీ అవుతున్నామని కీలక వ్యాఖ్యాలు చేశారు. గతంలో స్పీకర్లు ఓడిపోవడానికి కారణం.. ప్రజలకు అందుబాటులో లేకుండా అంటుముట్టుగా వ్యవహరించారని అన్నారు.

ఎమ్మెల్యేకు అపాయింట్ ఇవ్వకుండా ఉండేవారని అన్నారు. నేను అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ లో ఉండేవాణ్ణి అన్నారు. బాన్సువాడ నే నా అడ్డ అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంటు అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో గ్రామంలో తిరగాలంటే అప్పట్లో భయపడే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అభివృద్ధిని ఓట్లు రూపంలో ఎపించి, గెలిపించే బాధ్యత కార్యకర్తలు చూసుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు.

కాగా.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. నిజామాబాద్ జిల్లా చండూరు మండల కేంద్రంలోని 70 కమ్మ సంఘాల కుటుంబాలు, 50 నాయీబ్రాహ్మణ కుటుంబాలు స్పీకర్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ మేరకు వారు బాన్సువాడలో స్పీకర్‌ను కలిసి తీర్మానం ప్రతిని అందించారు.
Rakshit Shetty: మూడు వారాల వెనక్కి వెళ్లిన కల్ట్ సినిమా…