Leading News Portal in Telugu

MLC Kavitha : తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధం


MLC Kavitha : తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధం

తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. తెలంగాణలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధమన్నారు. ఇవాళ ఆమె నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ.. పేగుబంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆధరిస్తారని, తెలంగాణను వెనుకబడేయడంలో ఆ పార్టీకి అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది నెహ్రూ అని, 1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిగింది ఇందిరా గాంధీ హాయంలో అని ఆమె వ్యాఖ్యానించారు.

1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరా గాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారని, తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కవిత మండిపడ్డారు. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లి కారణంగా వందలాది మంది అమరులయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లిన కారణంగా వందలాది మంది అమరులయ్యారన్నారు. కాంగ్రెస్‌ తన ద్రోహ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని రాహుల్‌ గాంధీకి హితవు పలికారు ఎమ్మెల్సీ కవిత.