
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చిట్ చాట్లో భాగంగా.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీర్ఎస్ కు 88 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికలు ఉన్నపుడల్లా కాంగ్రెస్ ముహూర్తాలు పెట్టడం మాములేనని విమర్శించారు. తాము 95 శాతం అభ్యర్థులకు బి ఫార్మ్ లు ఇచ్చామన్నారు. ఎన్నికల్లో ఇప్పటివరకు ముందు ఉన్నాం… ఫలితాల్లో కూడా ముందు ఉంటామని కేటీఆర్ తెలిపారు. అక్కడక్కడా ఎమ్మెల్యేల మీద చిరు కోపం ఉన్న.. కేసీఆర్ లీడర్ షిప్ ను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో బీజేపీ రేసులో లేదని… కాంగ్రెస్ తోనే బీఆర్ఎస్ కి పోటీ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఆ పార్టీకి గుది బండ అని విమర్శించారు. రాహుల్ గాంధీ అజ్ఞాని అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు ఇచ్చారని… కానీ బీఆర్ఎస్ సర్కార్ 30 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఈ సారి తెలంగాణ వచ్చినప్పుడు విషయాలు తెలుసుకొని రావాలని చెప్పారు. మాకు వ్యవసాయం గురించి సుద్దులు చెబుతారా ?…మీకు బుద్ధి ఉందా ? అని మండిపడ్డారు.
నాయకులు మరినంతా మాత్రం ఓటర్లు మారరని కేటీఆర్ అన్నారు. గతంలో ఖమ్మంలో నాయకులు ఫుల్ గా ఉన్నారని…అయినా అక్కడ ఒక్క సీట్ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు నాయకులు పోయారు కాబట్టి ఎక్కువ సీట్లు గెలుస్తాం అని అనుకుంటున్నామని చెప్పారు. సి ఓటర్ సర్వే 2018లో వచ్చింది… కాంగ్రెస్ కు 64 సీట్లు అని చెప్పింది కానీ రాలేదన్నారు. ఇప్పుడు కూడా సి ఓటర్ అంచనా తప్పింది… కాబట్టి తాము అధికారంలోకి వస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బీజేపీకి ఒక్క సీటు వచ్చేలా ఉంది… అది కూడా డౌటేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి అభ్యర్థులు లేరని… 119 స్థానాల్లో ఈటెల రాజేందర్ పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డైరెక్ట్ పార్టనర్ లు అని అన్నారు. బీఆర్ఎస్ బి టీం కాదు… సి టీం కాదన్నారు. ఇక కాంగ్రెస్ లుచ్చా టీం అన్నారు. రాహుల్ గాంధీ ఇడ్లీలు, దోశలు వేసుకోండి విమర్శించారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన మంచి పని ఏంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.