Leading News Portal in Telugu

Revanth Reddy : కాంగ్రెస్ వస్తుంది… తెలంగాణ గెలుస్తుంది..!


Revanth Reddy : కాంగ్రెస్ వస్తుంది… తెలంగాణ గెలుస్తుంది..!

తెలంగాణలో ఎన్నికలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు బరిలో దించే అభ్యర్థుల లిస్ట్‌ను ఫైనల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40% కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం!
కాంగ్రెస్ వస్తుంది… తెలంగాణ గెలుస్తుంది!’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

అంతేకాకుండా.. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40 శాతం కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని, అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తోందన్నారు. ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లాది రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది! అని ట్వీట్ ముగించారు.