
Etela Rajender: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావును ఖరారు చేశారు. మరోవైపు తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. ఈటల రాజేందర్, గజ్వేల్.. హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమారెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు.
కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. బీఆర్ఎస్ నుంచి చేరిన బోగ శ్రావణికి జగిత్యాల టికెట్ దక్కింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు మానకొండూరు సీటును బీజేపీ ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం రాకపోవడంతో… నోముల దయానంద్‌గౌడ్‌కు ఈ సీటు ఖరారు చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ, విజయశాంతి, డీకే అరుణ, వివేక్ వెంకట్ స్వామి, లక్ష్మణ్ పేర్లు ఈ జాబితాలో కనిపించకపోవడంతో చర్చకు దారితీసింది.
తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు కేటాయించగా.. నలుగురు ఎంపీల్లో ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కరీంగనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, పార్టీ ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
NTR: శంషాబాద్ నుంచి గోవాకి షిఫ్ట్ అవుతున్న దేవర…