
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులకు చెప్పాము వాళ్ళు నియోజక వర్గాల్లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ఎల్లుండి చంద్రబాబు ని కలుస్తాము.. తరువాత అభ్యర్ధులని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజలోకి వెళ్ళామన్నారు కాసాని. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ బలపడుతుందన్నారు కాసాని జ్ఞానేశ్వర్. ప్రచారంలో బాలకృష్ణతో అగ్రనాయకులు పాల్గొంటారని, చంద్రబాబు జైల్లో అభివృద్ధి గురుంచే మాట్లాడుతున్నారన్నారు కాసాని జ్ఞానేశ్వర్. నేను ఆయనతో మాట్లాడితే పేదవాళ్ళని సంపన్నుల చేయాలనే ఆలోచనలో నే ఉన్నారు చంద్రబాబు అని, మేము ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది .. టీడీపీ కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
అంతేకాకుండా.. ‘ఎవరు ఎం చెప్పిన ప్రజలు సైకిల్ గుర్తుకే ఓటు వేస్తారు.. నిశబ్ద విప్లవం రాబోతుంది.. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదు.. మంచి జరగాలని ప్రజలు కోరుకుంటున్నపుడే మార్పు వస్తుంది.. రావుల చంద్రశేఖర్ పార్టీ మారనని పార్టీ మారారు.. కక్షపూరితంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్ లో పెట్టారు. చంద్రబాబు జైల్లోకి వెళ్లి , బయటకి వచ్చే ఫొటోల కోసమే అరెస్ట్ చేసారు.. జగన్ జైల్ కి వెళ్లారు.. అందుకే చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని పెట్టారు.’ అని కాసాని అన్నారు.