
తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు ట్రాఫిక్‌తో నిండిపోయాయి. అయితే.. దీంతో పోలీసులు నగరవాసులకు కోసం ట్రాఫిక్ అడ్వజరీ చేశారు. బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా వివిధ వాణిజ్య కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ పెరగిందని, వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ ట్రాఫిక్ పోలీస్ లకు సహకరించాలన్నారు. తమ వాహనాలను వాణిజ్య ప్రాంతాల యందు క్రమపద్ధతిలో పార్క్ చేసుకోవాలి. రోడ్ పై అడ్డదిడ్డంగా పార్క్ చేసి మెయిన్ ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ పోలీస్లకు సహకరించాలి. వివిధ ప్రాంతాలలో బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నందున ప్రజలు వీలైనంత వరకు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను (మెట్రో రైలు మరియు ఆర్టీసీ సిటీ బస్) ఉపయోగించుకుని ట్రాఫిక్ రద్దీ తగించుటకు ట్రాఫిక్ పోలీస్ లకు సహకరించాలి.
ట్రాఫిక్ రద్దీ గా ఉండే ప్రాంతాలు
మదీనా, పత్తర్ ఘట్టి పరిసర ప్రాంతాలు
చార్మినార్ మరియు పరిసర ప్రాంతాలు
నాయాపూల్ జంక్షన్
పురనాపూల్ జంక్షన్
యం జే బ్రిడ్జి & భూలక్ష్మి దేవాలయం
బేగం బజార్ చత్రి, బేగం బజార్ మరియు గోషామహల్ పరిసర ప్రాంతాలు
సిద్దియాంబర్ బజార్ మజీద్ పరిసర ప్రాంతాలు మరియు యంజే మార్కెట్ కూడలి
మోహదీపట్నం మార్కెట్ కూడలి
గుడి మల్కా పూర్ పూల మార్కెట్
దిల్ సుఖ్ నగర్ పరిసర వాణిజ్య ప్రాంతాలు